నాన్న! నువ్వు నాన్నవా లేక నంది వాహనుడివా ?

నాన్న! నువ్వు నాన్నవా లేక నంది వాహనుడివా ?

కలలు కంటూ అలసిపోతున్న మా కళ్ళను నీ ముక్కంటితో కాచుకున్నావ్; 

మా బ్రతుకుల వైకుంఠపాళిలో గరళాల్ని నీ కంఠం లో నింపుకున్నావ్;

మా కన్నీటన్నిటిని మూట కట్టినవ్, నీ శిరస్సు మీద భారం పెట్టుకున్నావ్;

నాన్న నువ్వు తండ్రివా లేక త్రికంటివా ?

మా బాధల బూడిదను నీ ఒంటికి రాసుకున్నావ్;

మా తాటాకు భయాల్ని చీల్చి, చెమదాల్ని చుట్టుకున్నావ్;

మా కష్టాల శ్మశానాన్ని నీ శాశ్వత నివాసం చేసుకున్నావ్;

నిద్ర నిశ్చలం మానుకున్నావ్, డం-డం డం-డం ఢమరుకం వాయించినవ్

మెతుకు మెతుకు కుప్ప చేసినవ్, మా కుండ పొట్టల్ని మెండు చేసినవ్;

నాన్న! నువ్వు నాన్నవా లేక నీల కంఠుడివా??

Comments

Popular posts from this blog

నీ నీడ

NOSTALGIA

I'M A SO-CALLED "HUMAN"