అమ్మా! మరింకెలా రాసేదమ్మా? నీ ప్రేమను పోల్చే కవిత్వం...



గుండెల్లో పొంగుతున్న భావం , కాగితం మీద మాత్రం  కదలనంటోందమ్మ, 


ఎందుకంటే, నీ సుగుణాల్ని పోల్చగల వస్తువేదీ  కనిపెట్టలేదా  బ్రహ్మ;


నీ నిర్విరామ ఓరిమినెలా పోల్చనమ్మా? అందలేదే  నీ సహనాన్ని ఆ నేలమ్మ;


నీ హృదయాలయాల చల్లదనాన్ని తాకలేదే ఆ హిమాలయాల చెమ్మ;


నీ వెచ్చని కౌగిలింతని సరితూగదే  ఆ వెండి వెన్నెలమ్మ; 


నీ కమ్మని కారపు ముద్దని పోల్చ ఏ అమృతం సరిపోయెనమ్మ?


ఏ మహాకావ్యం లో చదవాలమ్మా నీ త్యాగాన్ని తెలిపే భావం?


ఏ భాష లో రాసారమ్మ  నీ రాగాన్ని తేలిపే భాష్యం?


ఏ నిఘంటువులో వెతికేనమ్మ నీ నిస్వార్ధాన్ని నిర్వచించే పదం?


మరింకెలా రాసేదమ్మా? నీ ప్రేమను పోల్చే కవిత్వం...   


Comments

Popular posts from this blog

నీ నీడ

NOSTALGIA

I'M A SO-CALLED "HUMAN"